5లక్షల దీపాలతో 150 అడుగుల శ్రీరాముడి చిత్రం - శ్రీరామనవమి న్యూస్
🎬 Watch Now: Feature Video
బిహార్ భగల్పుర్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకొని 150 అడుగుల పొడవైన రాముడి చిత్రాన్ని రూపొందించారు. పట్టణంలోని లజ్పత్పార్క్లో 5 లక్షల దీపాలను, 12 రకాల రంగులను ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారుచేశారు. ఈ చిత్ర తయారీ గత ఐదు రోజులుగా కొనసాగుతుండగా.. అనేక మంది పాలుపంచుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నామని నిర్వాహకుడు అర్జిత్ చౌబే తెలిపారు. శ్రీరామ నవమి రోజు జరిగే కార్యక్రమానికి బిహార్ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST