ప్రసంగాన్ని అడ్డుకున్న వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ - beti bachao mahapanchayath in delhi
🎬 Watch Now: Feature Video
ప్రసంగాన్ని ఆపమని చెప్పినందుకు ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టింది మహిళ. ఈ ఘటన దిల్లీలో జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసులో న్యాయం జరగాలంటూ మంగళవారం హిందూ ఏక్తా మంచ్ 'బేటీ బచావో మహాపంచాయత్' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఛత్తర్పుర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఓ మహిళ మాట్లాడుతుండా ఓ వ్యక్తి వేదికపైకి ఎక్కి ఆమె ప్రసంగాన్ని ఆపమన్నాడు. దీంతో ఆగ్రహించిన మహిళ అతడిని చెప్పుతో కొట్టడం మొదలుపెట్టింది. వెంటనే కిందనున్న కార్యకర్తలు ఆమెని అడ్డగించి శాంతింపచేశారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. శ్రద్ధాను అఫ్తాబ్ హత్య చేసిన తీరుపై హిందూ సంస్థల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST