రెండేళ్ల తర్వాత కనిపించిన తెల్ల ఎలుగుబంటి వీడియో వైరల్ - తెల్ల ఎలుగు హల్చల్
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్‌గఢ్‌లోని మర్వాహీ అడవుల్లో రెండు ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. అందులో ఒకటి తెల్ల ఎలుగుబంటి ఉండగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఎలుగులు అడవిలో సంచరించిన దృశ్యాలను స్థానికులు మొబైల్‌లో బంధించారు. దాదాపు రెండేళ్లుగా అడవిలో తెల్లటి ఎలుగుబంటి కనిపించలేదని స్థానికులు తెలిపారు. తెల్ల ఎలుగులు అంతరించిపోయాయని అనుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తెల్లటి ఎలుగుబంటి కనిపించడం పట్ల వన్యప్రాణి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST