ఆస్పత్రిలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వార్డ్ బాయ్ డాక్టర్ చెప్పారని
🎬 Watch Now: Feature Video
గాజియాబాద్‌లోని ఓ ఆస్పత్రి వార్డ్బాయ్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. త్వరగా ఆపరేషన్ జరగాలంటే రూ. 5 వేల లంచం ఇవ్వాలని హెర్నియా ఆపరేషన్‌కు వచ్చిన ఓ లాయర్‌ను డిమాండ్ చేశాడు వార్డ్బాయ్. మొదట వారు నిరాకరించారు. ఆ తర్వాత అతనికి రూ.3 వేలు అడ్వాన్ ఇచ్చారు. ఆ సమయంలో రహస్యంగా వీడియో తీసిన కుటుంబసభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు దోషులకు శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. వార్డ్ బాయ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కటకటాల వెనక ఉన్నాడు. అయితే తాను ఇదంతా ఓ డాక్టర్ చెబితే చేశానని చెప్పాడు వార్డ్బాయ్.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST