అర్ధరాత్రి ముసుగు దొంగల హల్చల్.. ATMలను పెకిలించి లక్షలు చోరీ - ATMs looted in Rajasthan
🎬 Watch Now: Feature Video
అర్ధరాత్రి ముసుగు దొంగలు హల్చల్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఓ ఏటీఎమ్‌లోకి ముసుగు ధరించిన కొందరు దుండగులు చొరబడ్డారు. అనంతరం ఆ ఏటీఎమ్‌ను పెకిలించారు. రూ.8 లక్షలు ఉన్న ఆ ఏటీఎమ్‌ను ఎత్తుకెళ్లారు. 7 నుంచి 8 నిమిషాల్లో చోరీ పూర్తి చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మేర్ జిల్లా రూపన్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్సురా అనే గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంకు మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వాచ్‌మ్యాన్ లేకపోవడమే దొంగలకు అనుకూలించిందని పోలీసులు తెలిపారు.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఇదే తరహా ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆరై గ్రామంలోని ఓ ఏటీఎమ్‌లో దొంగలు పడి రూ. 31.60 లక్షలు ఉన్న ఏటీఎమ్‌ను పెకిలించారు. అనంతరం దాన్ని ఓ వాహనంలో పెట్టి ఎత్తుకెళ్లారు. ఇదే కాకుండా గత డిసెంబర్ బెహ్రోర్‌లో ఓ ఏటీఎమ్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి రూ. 15 లక్షలు దోచుకుని పరారయ్యారు.