ఏనుగు కోసం స్పెషల్ స్విమ్మింగ్‌పూల్.. రూ.8 లక్షలతో నిర్మాణం - ఏనుగు కోసం ఆలయంలో ప్రత్యేక స్విమ్మింగ్‌పూల్
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని తంజావూరులో కుంబేశ్వర ఆలయంలో ఏనుగు కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్‌పూల్ నిర్మించారు స్థానికులు. రూ.8.40 లక్షల వ్యయంతో 55 ఏళ్ల మంగళం అనే ఏనుగుకు స్నానం చేయించేందుకు స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించారు. కాంక్రీట్ ఫ్లోర్, 8 ఫీట్ల ఎత్తు, 29 అడుగుల పొడవుతో ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని చేపట్టారు. సోమవారం ఈ ప్రత్యేక ఏనుగు ఈత కొలనును డోలు వాయిద్యాల మధ్య తమిళనాడు హిందూ ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ప్రారంభించారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST