తలకు ఆపరేషన్‌తో పాముకు పునర్జన్మ - కర్ణాటకలో పాముకు వైద్యంచేసిన డాక్టర్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17351604-thumbnail-3x2-snake.jpg)
కర్ణాటకలో గాయపడిన పాముకు ఓ డాక్టర్ వైద్యం చేశారు. విజయవంతంగా దానికి శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించారు. ధార్వాడ్‌లోని హాలియా రోడ్డులో గాయపడిన స్థితిలో ఉన్న ఓ పామును జంతు ప్రేమికుడు సోమశేఖర్ గుర్తించాడు. వెంటనే దాన్ని పట్టుకొని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైద్యుడు అనిల్ పాటిల్ వద్దకు వెళ్లాడు. పామును పరీక్షించిన డాక్టర్ దాని తలపై కణితిలాంటిది ఉందని, దాని నుంచి రక్తం కారుతుందని గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి పామును రక్షించారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST