రోడ్లు సరిగ్గా లేక గుర్రంపై పాఠశాలకు వెళ్తున్న విద్యార్థి
🎬 Watch Now: Feature Video
స్కూల్‌కు ఎవరైనా బస్సు, ఆటోలలో వెళ్తుంటారు. లేదా సైకిల్‌పై వెళ్తారు. అయితే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన ఓ 6వ తరగతి విద్యార్థి మాత్రం గుర్రంపై స్కూల్‌కు వెళ్తున్నాడు. తమ గ్రామానికి రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్లే నాలుగు కిలోమీటర్లు అశ్వంపైనే ప్రయాణించి పాఠశాలకు చేరుకుంటున్నానని బాలుడు లలిత్ కుమార్ తెలిపాడు. చదువు మీద ఉన్న ఆసక్తితోనే తాను ఇలా చేస్తున్నానని చెెప్పాడు. పాఠశాలకు వెళ్లాక మేత కోసం గుర్రాన్ని సమీపంలోని ఓ పొలంలో కట్టేస్తున్నట్లు చెప్పాడు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST