పక్షిని కాపాడేందుకు వెళ్లి ఇద్దరు మృతి.. లైవ్ వీడియో! - పక్షిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు మృతి
🎬 Watch Now: Feature Video
రోడ్డుపై పడిపోయి విలవిల్లాడుతున్న పక్షిని చూసి చలించిపోయిన ఇద్దరు వ్యక్తులు దానిని కాపాడే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయి మహానగరంలో జరిగింది. బాంద్రా-వర్లీ సీలింక్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా రోడ్డుపై ఓ పక్షి పడిపోయి కనిపించింది. దానిని కాపాడేందుకు కారు దిగి రోడ్డుపైకి వెళ్లారు. ఈ సమయంలోనే వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరిపడ్డారు. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు వైరల్గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST