కళ్లు ఆర్పిన హనుమంతుడు.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం! - ఖార్​గోన్ హనుమంతుడు కన్ను ఆర్పడం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 18, 2022, 10:12 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

Hanuman Idol blinking eyes : మధ్యప్రదేశ్​లో అద్భుతం జరిగింది. హనుమంతుడు కళ్లు ఆర్పడం కెమెరాకు చిక్కింది. ఖార్​గోన్ జిల్లా బడవా మున్సిపాలిటీ పరిధి, ఓఖ్లా గ్రామంలోని ఓఖ్లేశ్వర్ ధామ్​లో ఉన్న హనుమాన్ మందిరంలో ఈ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం హనుమంతుడు కళ్లు ఆర్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇది దేవుడు చేసిన మహిమే అని భక్తులు, ఆలయ పూజారి చెబుతున్నారు. ఇక్కడ ఇలాంటి అద్భుతాలు జరగడం కొత్తేమీ కాదని అంటున్నారు. ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు. అయితే, వైరల్ అవుతున్న ఈ వీడియో వాస్తవికతను 'ఈటీవీ భారత్' నిర్ధరించలేదు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.