బావిలో పడిన ఎలుగుబంటి.. 12 గంటలు నరకం.. చివరకు సేఫ్గా అడవికి..
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర కిన్వట్లోని ఓ పొలంలో ఉన్న బావిలో ఓ ఎలుగుబంటి పడిపోయింది. ఆ ప్రాంతానికి రెండు భల్లూకాలు రాగా.. అందులో ఒకటి ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు బావిలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలుగును రక్షించేందుకు ప్రయత్నించారు. మంచానికి తాళ్లు కట్టి బావిలో వేసి భల్లూకాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు ఎలుగును బయటకు తీశారు. అనంతరం దానిని అటవీ అధికారులు బోనులో బంధించి, సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST