ఏనుగుల మధ్య ఫైట్​ చూసి బెంబేలెత్తిన గ్రామస్థులు - జనావాశాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 4, 2022, 4:11 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

అసోంలో ఏనుగుల గుంపులు హల్​చల్​ సృష్టించాయి. అడవిలో ఉండే కొన్ని వందల ఏనుగులు పంట పొలాల్లోకి ప్రవేశించి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులు ఒకదానితో మరొకటి పోట్లాడుకుంటూ స్థానికులకు కనిపించాయి. ఈ ఘటన నగావ్​ జిల్లాలో జరిగింది. పోట్లాడుకునే గజరాజులను చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ఈ గుంపులు ఆహారం కోసం స్థానిక పంట పొలాల్లోకి ప్రవేశించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఓ పెద్ద గుంపు రైల్వేగేటు దాటిమరి పాటియాపం పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు స్థానికులు వెల్లడించారు. గతంలో కూడా అదే రైల్వే గేటు దాటుతుండగా కొన్ని ఏనుగులు మృతి చెందినట్లు తెలిపారు. ఏనుగులు ప్రస్తుతం పాటియాపం, చాంగ్‌జురై, టెటెలిసర్​, తేలియాటి తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. కొందరు గ్రామస్థులు నిప్పు రాజేసి వాటిని తిరిగి అడవిలోకి పంపడానికి ప్రయత్నించారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.