విద్యుత్​ తీగలపై నగ్నంగా వేలాడుతూ యువకుడి విన్యాసాలు - విద్యుత్ తీగలపై యువకుడి విన్యాసం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 19, 2022, 10:51 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

మధ్యప్రదేశ్​లోని దమోహ్ జిల్లాలో ఓ యువకుడు విచిత్ర విన్యాసాలు చేశాడు. షాజాద్​పురా అనే గ్రామంలో ఓ యువకుడు నగ్నంగా విద్యుత్ వైర్లపై వేలాడుతూ ఓ​ స్తంభం పైనుంచి మరో స్తంభానికి వెళ్లాడు. కింద ఉన్నవారు ఎంత చెప్పినా వినకపోవడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడ్ని కిందకు దించారు. అయితే ఆ వ్యక్తిని మతిస్థిమితం లేనివాడిగా గుర్తించారు. యువకుడు వేలాడుతున్న సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. కొందరు ఈ విన్యాసాన్ని వీడియో తీయగా ప్రస్తుతం అది వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.