పిలవని పెళ్లికి వెళ్లి రూ.200 గిఫ్ట్ వద్దనేసరికి నానా రభస
🎬 Watch Now: Feature Video
పిలవని పేరంటానికి వెళ్లిన యువకుడు అక్కడి అతిథులపై దాడి చేశాడు. కానుకలు స్వీకరించలేదని అభిజిత్ అనే యువకుడు వివాహ విందులో హల్చల్ చేశాడు. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది. వధువు సోదరుడికి స్నేహితుడైన అభిజిత్‌కు వివాహానికి ఆహ్వానం అందలేదు. గతంలో గొడవ జరిగిన కారణంగా అభిజిత్‌ను పెళ్లికి, రిసెప్షన్‌కు పిలవలేదు వధువు సోదరుడు. అయినప్పటికీ అభిజిత్ రిసెప్షన్‌కు వెళ్లాడు. అనంతరం పెళ్లి కానుకగా 200 రూపాయలు ఇచ్చాడు. కానుకను తీసుకునేందుకు వధువు తండ్రి అనిల్ కుమార్ నిరాకరించాడు. దీంతో అతిథులపై దాడి చేశాడు అభిజిత్. ఈ దాడిలో అనిల్‌తో పాటు పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసుల సమక్షంలో పెళ్లి జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST