బావిలోకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ దృశ్యాలు - బావిలో పడ్డ కారు
🎬 Watch Now: Feature Video

Car falls into well: కేరళ కాసర్గోడ్లో ఓ కారు హల్చల్ సృష్టించింది. పూచక్కడ్ ప్రాంతంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ లోతైన బావిలో అదుపుతప్పి పడిపోయింది. అప్పటికే ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. సమీపంలో ఉన్న ఓ వృద్ధుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. అందులో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఉడుమా ప్రాంతంలో నివసించే అబ్దుల్ నాసిర్ ఈద్ పర్వదినం సందర్భంగా తన సోదరి ఇంటికి పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు.. బావిలోని నీటిలో పాక్షికంగా మునిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి వారిని కాపాడారు. ఆశ్చర్యకరంగా ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. తాళ్ల సాయంతో బావిలో నుంచి బయటకు వచ్చారు. జేసీబీ ఉపయోగించి కారును బావిలో నుంచి బయటకు తీశారు. వాహనంలో ఉన్నవారికి స్వల్ప గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST