అర్ధరాత్రి తుపాకులతో వెంటాడి వ్యాపారి దారుణ హత్య - businessman murder news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 11, 2022, 5:08 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

దిల్లీలో ఆదివారం రాత్రి ఓ టెక్స్​టైల్స్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. బిందాపూర్ ప్రాంతంలో మోహిత్​ అరోరా అనే ఓ వ్యాపారి తన తమ్ముడు రోహిత్​ అరోరాతో కలిసి బైక్​పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే దుండగుడు బైక్​పై ఎదురుగా వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన తరవాత అన్నదమ్ములిద్దరూ బైక్​ని అక్కడే వదిలి పరిగెత్తారు. అయితే ఆ తరవాత మోహిత్ రోడ్డుపై పడిపోయాడు. కాల్పుల్లో మోహిత్​ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. వ్యాపారి వద్ద ఉన్న డబ్బును కాజేయడానికే దుండగుడు ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన మొత్తం స్థానిక సీసీటీవీలో రికార్డైంది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.