కుప్పకూలిన ఐరన్ బ్రిడ్జ్.. మధ్యలో ఇరుక్కుపోయిన లారీ - లారీ వెళ్తుండగా కూలిన వంతెన
🎬 Watch Now: Feature Video
బిహార్‌లో దర్భంగా జిల్లాలో ఓ ఐరన్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. కమ్లా నదిపై ఉన్న ఇనుప వంతెనపై ఓ లారీ లోడ్‌తో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా వంతెన రెండుగా చీలిపోగా లారీ బ్రిడ్జ్‌పై ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ నీటిలోకి దూకి సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థుల సాయంతో లారీని బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. దాదాపు 10 గ్రామాలను కలిపే ఈ వంతెన తెగిపోవడం వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులు వంతెన నిర్మించిన కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.