పెళ్లైన మరుసటి రోజే పరీక్షకు హాజరైన వధువు.. ఎగ్జామ్ అయ్యేంతవరకూ వేచిచూసిన వరుడు - పెళ్లైన మరుసటి రోజే పరీక్షకు హాజరైన వధువు
🎬 Watch Now: Feature Video
పెళ్లైన మరుసటి రోజే పరీక్షకు హాజరైంది ఓ వధువు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌లో జరిగింది. గురువారం పెళ్లి జరగగా.. శుక్రవారం ఉదయమే వెళ్లి పరీక్ష రాసివచ్చింది. లక్సర్ పథ్రికి చెందిన అంజలి గార్గ్ డిగ్రీ కాలేజీలో బీకామ్ చదువుతోంది. ఆమెకు రాజేశ్ అనే వ్యక్తితో గురువారం వివాహం జరిగింది. అయితే శుక్రవారం తనకు పరీక్ష ఉందని భర్త సహా అత్తమామకు చెప్పింది. దీనికి వారు అంగీకరించడం వల్ల ఉదయాన్నే పరీక్షకు హాజరైంది. వరుడు రాజేశ్ స్వయంగా కారులో పరీక్ష కేంద్రం వద్ద భార్యను దించాడు. అనంతరం పరీక్ష ముగిసేంత వరకు కేంద్రం వద్దే ఎదురు చూశాడు. పరీక్ష ముగిసిన అనంతరం భర్త రాజేశ్‌ను చూసిన అంజలి ఆనందంలో మునిగిపోయింది.
జీవితంలో పెళ్లి తప్పనిసరి అయినప్పటికీ.. చదువుకు కూడా చాలా ముఖ్యమని చెబుతోంది వధువు. అంజలి పట్టుదలను చూసిన ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. ఎంతో మంది యువతకి అంజలి ఆదర్శంగా నిలుస్తోందన్నారు కళాశాల డైరెక్టర్ సంజీవ్. ఒకవేళ అంజలి ఈ పరీక్ష రాయకపోతే ఏడాది కోల్పోవాల్సి వచ్చేదని చెప్పారు.