ఫ్లైఓవర్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్.. తుపాకులు పేల్చుతూ హల్చల్ - బిహార్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15225321-thumbnail-3x2-firing.jpg)
birthday celebration firing: బిహార్ రాజధాని పట్నా నడిబొడ్డున కొందరు యువకులు హల్చల్ చేశారు. ఫ్లైఓవర్‌పై జన్మదిన వేడుకలు చేసుకుంటూ ట్రాఫిక్ జామ్‌కు కారణమవటమే కాకుండా తుపాకీ పేల్చుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాహుల్ యాదవ్ అనే యువకుడి ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు వారాల క్రితం ఈ వేడుకలు లైవ్ స్ట్రీమింగ్ చేశారు. చాలా మంది యువకులు ఇందులో పాల్గొన్నారు. రోడ్డుపై వారి వాహనాలను వరుసగా పెట్టటం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేక్ కట్టింగ్ తర్వాత కొందరు యువకులు తుపాకులు పేల్చుతూ కనిపించారు. రాజధానిలో యువకులు తుపాకులతో హల్చల్ సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST