కదులుతున్న ఆటోలో పేలుడు ఉగ్రవాదుల చర్యేనన్న డీజీపీ - మంగళూరులో పేలిన ఆటో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 20, 2022, 10:09 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

కదులుతున్న ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా మరో ప్రయాణికుడు గాయపడ్డాడు. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిందీ ఘటన. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఈ ఘటన ప్రమాదం కాదని తేల్చారు. ఇందులో ఉగ్రకోణం ఉందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.