కాలువలో ఆరు కొండచిలువలు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ - కేరళ కొండచిలువ న్యూస్
🎬 Watch Now: Feature Video
కేరళలో కొండచిలువలు కలకలం సృష్టించాయి. సోమవారం కోజికోడ్ నగర శివారులోని కరపరంభ ప్రాంతంలోని కనోలీ కాలువలో ఆరు కొండచిలువలు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసేందుకు ప్రజలు బారులుతీరారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే వాటిలో ఒక్క సర్పాన్ని మాత్రమే పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించ గలిగారు. మిగిలిన ఐదు పాములు కనిపించకుండా పోయాయని సిబ్బంది తెలిపారు. ఆహారం కోసమే ఈ ఆరు కొండచిలువలు అడవి బయటకు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST