‘ఆదిత్య 369’ తరహాలో వింత శకటం.. హలో ఎవరైనా ఉంటే తెరవండి కాపాడుతాం..! - ఆకాశంలో రిసెర్చ్ బెలూన్
🎬 Watch Now: Feature Video

Research Balloon in Vikarabad : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఓ వింత శకటం ప్రత్యక్షమైంది. ‘ఆదిత్య 369’ సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటాన్ని స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు. ఆ శకటం వద్ద ఓ వ్యక్తి ఆసక్తికరంగా సంభాషణ జరిపాడు. 'హాలో అందులో ఎవరైనా ఉంటే తెరవండి.. కాపాడుతాము ప్లీజ్ తెరవండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు'. కొందరు అది ఎక్కడి నుంచి వచ్చిపడిందోనని భయాందోళనలకు గురయ్యారు. దీని గురించి అధికారులకు సమాచారం అందించారు. అయితే అది రీసెర్చ్ హీలియం బెలూన్ అని అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పుల అధ్యయనాల కోసం శాస్త్రవేత్తలు వాటిని పంపుతున్నట్లు చెప్పారు. బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పంపినట్లు వివరించారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST