కన్నబిడ్డపై తల్లి కర్కశత్వం.. ఛాతిపై బాది.. నేలకేసి కొట్టి..
🎬 Watch Now: Feature Video
కన్నబిడ్డతో కర్కశంగా ప్రవర్తించింది ఓ తల్లి. కనికరం లేకుండా పసిబిడ్డను తీవ్రంగా హింసించింది. చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్నప్పటికీ.. ఆ మహిళ కొట్టడం ఆపలేదు. ఛాతిపై బలంగా కొడుతూ కింద పడేసింది. అమ్మతనానికి మచ్చతెచ్చే ఈ ఘటన జమ్ము కశ్మీర్లోని సాంబ జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి.. మహిళను అరెస్టు చేశారు. ఆమెను ప్రీతి శర్మగా గుర్తించారు. ఆమె.. కామిలా పుర్మండల్కు చెందిన మాన్ సింగ్ భార్య అని పోలీసులు తెలిపారు. మహిళ మానసిక పరిస్థితి ఎలా ఉందనే సమాచారం లేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST