హిజాబ్ వివాదం.. కర్ణాటకలో బంద్.. దుకాణాల మూసివేత - hijab issue news
🎬 Watch Now: Feature Video
HIjab Row: హిజాబ్ ధరించడంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా.. రాష్ట్ర బంద్‌కు అమీర్-ఈ-షరియత్ అనే ముస్లిం సంస్థ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్‌కు మద్దతుగా మంగళూరులో ముస్లిం వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. దీంతో నగరంలోని బందర్, కుద్రోలి, స్టేట్ బ్యాంక్ రోడ్డు, మార్కెట్ రోడ్డులోని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ముస్లిం వ్యాపారులు మినహా మిగతావారు యథావిధిగా తమ వ్యాపారాలను కొనసాగించారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST