40 అడుగుల టవర్ ఎక్కి బాలుడు హల్చల్- కారణం తెలిస్తే..! - టవర్ ఎక్కిన బాలుడు
🎬 Watch Now: Feature Video
A Child Climbed on High Tower: 8 ఏళ్ల బాలుడు 40 అడుగుల టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. హాస్టల్కు వెళ్లనని మారాం చేశాడు. ఒకవేళ పంపిస్తే.. అక్కడి నుంచి దూకుతానని బెదిరించడం గమనార్హం. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బిహార్ గోపాల్గంజ్ పరిధిలోని ఛవ్డీ గ్రామంలో ఫిబ్రవరి 21న ఈ ఘటన జరిగింది. దానాపుర్లోని రెసిడెన్షియల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న సొహైల్.. కరోనా నేపథ్యంలో చాలాకాలంగా ఇంటివద్దే ఉంటున్నాడు. ఇప్పుడు హాస్టల్ వెళ్లాలని అడగగా.. ఇలా టవర్ ఎక్కినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడ గుమికూడిన వారంతా.. చాలా సేపు ఒప్పించగా బాలుడు కిందికి దిగాడని పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST