ETV Bharat / sukhibhava

ఇలా చేస్తే నిత్యం ఉత్సాహంగా ఉంటారు... - tips to be healthy

శరీరం అనారోగ్యానికి గురైన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కన్నా.. ముందుగానే ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. చిన్న చిన్న అంశాల్లో పాటించే పద్ధతులే నిత్యం ఉత్సాహంగా మారుస్తాయి.

tips to be healthy and for a joyful and happy life
ఇలా చేస్తే నిత్యం ఉత్సాహంగా ఉంటారు...
author img

By

Published : Aug 28, 2020, 1:42 PM IST

  • ఇంట్లో అందరికంటే ముందుగా నిద్రలేవండి. నులివెచ్చని సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ బాల్కనీ లేదా పెరట్లో కాసేపు గడపండి. దీనివల్ల శరీరానికి కావాల్సిన విటమిన్-డి సమకూరుతుంది. ఇది మనలోని నిరుత్సాహాన్ని దూరం చేస్తుంది.
  • నిద్రలేచిన వెంటనే హడావుడిగా పనులు మొదలుపెట్టకుండా ధ్యానంతో రోజును ప్రారంభించండి. నిద్రపోయే ముందూ ఇదే చేయండి. తలదిండుపై రెండు చుక్కల లావెండర్ లేదా జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలను వేస్తే చాలు. ఇది మనసును ఆహ్లాదంగా మారుస్తుంది. కంటి నిండా నిద్రపడుతుంది. ఒత్తిడి మాయమవుతుంది.
  • వారానికి ఒకసారి శరీరంలోని మలినాలను బయటికి పంపే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం రాత్రిపూట నీటిలో తాజాపండ్లు, పచ్చిఅల్లం ముక్కలను వేసి నానబెట్టాలి. ఈ నీటిని ఉదయం తీసుకోవాలి. వీలైతే ఎక్కువ నీటిని పానీయంలా తయారు చేసుకుని మరుసటి రోజంతా తాగితే మంచిది. ఇది వ్యర్థాలను బయటకు పంపుతుంది.
  • ఇంటి నుంచి లేదా కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు గంటకోసారి స్వల్ప విరామం తీసుకుని చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి.
  • వారానికి ఒకసారి గోరువెచ్చని కొబ్బరినూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. ఇది మసాజ్​లా పనిచేసి నాడులను ఉత్తేజపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. దీంతోపాటు అప్పుడప్పుడు మనకోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకుని అది మనసుకు నచ్చిన స్నేహితులతో మాట్లాడటం, ఇష్టమైన వంటకాన్ని తయారు చేయడం వంటివి మెదడుకు వ్యాయామంలా పని చేస్తాయి. ఇవి వారానికి సరిపడా ప్రశాంతతను అందిస్తాయి.
  • రోజులో మధ్యాహ్నంపూట పావుగంట సేపు వేసే చిన్న కునుకు శరీరాన్ని ఉత్తేజంగా మారుస్తుంది. మనసులోకి ఆందోళనను దగ్గరికి రానివ్వదు. రాత్రిపూట నిద్రపోయే ముందు అలసటగా అనిపిస్తే, గోరువెచ్చని నీటిని నింపిన చిన్న టబ్​లో పాదాలు మునిగేలా అరగంటసేపు ఉంచాలి. దీనివల్ల కాళ్లు, పాదాల కండరాలు ఉపశమనం పొందుతాయి. లేదంటే ఆ అలసట మరుసటి రోజు కూడా మనల్ని వెంటాడుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.