Migraine causes : పార్శ్వనొప్పి బాధ వర్ణనాతీతం. లోపల ఏదో బాదుతున్నట్టు ఒకటే నొప్పి. ఇదొక్కటేనా? వికారం, వాంతి.. వెలుతురు, చప్పుడు తట్టుకోలేకపోవటం వంటివీ ఇబ్బంది పెడుతుంటాయి. ఒకసారి పార్శ్వనొప్పి మొదలైతే 4 గంటల నుంచి 72 గంటల వరకూ కొనసాగొచ్చు. దీంతో కొందరు ఏ పనీ చేయలేరు. పార్శ్వనొప్పి మగవారి కన్నా ఆడవారిలో 2-3 రెట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఈస్ట్రోజెన్ హార్మోన్. ఇది తలలో కీలకమైన నాడి చుట్టూరా ఉండే కణాలను, అలాగే రక్తనాళాలను పార్శ్వనొప్పి ప్రేరకాలకు త్వరగా స్పందించేలా చేస్తుంది. ఫలితంగా పార్శ్వనొప్పి తలెత్తే అవకాశమూ పెరుగుతుంది.
ఒత్తిడి, నిస్సత్తువ, తిండి మానెయ్యటం, ఒంట్లో నీటిశాతం తగ్గటం, మద్యపానం, కెఫీన్, చాక్లెట్లు, పుల్లటి పండ్లు, ఛీజ్, నిద్రలేమి.. ఎండ, వేడి, తేమ వాతావరణాలకు గురికావటం, నెలసరి ప్రక్రియ, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతి, పొగ, పెద్ద శబ్దాలు, జనం గుమిగూడే ప్రాంతాలు, గర్భనిరోధక మాత్రల వంటి కొన్ని మందులు, ఘాటైన వాససలు.. ఇలా రకరకాల అంశాలు పార్శ్వనొప్పిని ప్రేరేపిస్తుంటాయి. అందువల్ల ఎలాంటి వాటికి గురైనప్పుడు నొప్పి తలెత్తుతోందో గుర్తించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా దీని బారినపడకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు.
ఇదీ చదవండి: కృత్రిమ క్లోమ పరికరం.. మధుమేహ పిల్లలకు వరం!