ETV Bharat / sukhibhava

రుద్రాక్షతో పుణ్యం, పురుషార్థం! - రుద్రాక్ష ఔషధ ఉపయోగాలు

శరీరానికి తరిగిపోని శక్తిని ప్రసాదించగలిగే రుద్రాక్షను ఆయుర్వేదం వేల సంవత్సరాల కిందటే మహత్తర మూలికగా గుర్తించింది. మానసిక రుగ్మతలనే కాక గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం వరకు రుద్రాక్ష నయం చేయగలదు. ఆయుర్వేదంలో ఈ జపమాల స్థానం గురించి డా. రంగనాయకులు, ఆయుర్వేద వైద్య నిపుణులు ఈటీవీ భారత్​తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

రుద్రాక్ష ఔషధ ఉపయోగాలు
Medicinal benefits of Rudraksha
author img

By

Published : Mar 19, 2021, 10:41 AM IST

ఎలకార్పస్ ప్రజాతిలో రుద్రాక్ష వృక్షాలు ఒక భాగం. ఎలకార్పస్ గెనిటస్ లేదా ఎ. స్పెరకార్పస్ వృక్షాల నుంచి ఈ రుద్రాక్ష గుళ్లను సేకరిస్తారు. ఈ పవిత్ర వృక్షాలు గంగా పరివాహక ప్రాంతంలో, హిమాలయ సానువుల్లో, ఆగ్నేయ ఆసియాలోనూ పెరుగుతున్నాయి. పక్వం కాక ముందు ఈ ఫలాలు నీలి రంగులో ఉండి ఆ తరువాత ఊదా, నలుపు రంగులోకి మారతాయి.

రుద్రాక్షలో మధుర రసం, ఉష్ణ వీర్యం ఉంటాయని, నాడీ కణాలు వేగంగా పెరగటానికి, గుండె పనితీరు మెరుగుపడటానికి రుద్రాక్ష సహాయం చేస్తుందని ఆయుర్వేదం గుర్తించింది. గోరోచనాదివటి, ధన్వంతరి గుటిక, మృత సంజీవని గుటిక మొదలైన ఆయుర్వేద ఔషధాలలో రుద్రాక్ష భాగంగా ఉంటుంది.

రుద్రాక్ష ఔషధ ఉపయోగాలలో కొన్ని:

  • రుద్రాక్ష చూర్ణాన్ని బ్రాహ్మీ చూర్ణంతో కలిపి ఔషధంగా వాడితే మూర్ఛ వ్యాధి శమిస్తుంది.
  • రక్తంలో కొలెస్టిరాల్ తగ్గటానికి రుద్రాక్షను పాలలో ఉడికించి రోజుకు ఒకసారి తాగాలి.
  • పరిశుభ్రమైన గులాబి నీటిలో రుద్రాక్షను రాత్రంతా నానబెట్టి, ఆ నీటిని కంటికి చుక్కల మందుగా వాడవచ్చు.
  • రుద్రాక్ష మాలను నిత్యం ధరిస్తే ఆందోళన తగ్గుతుంది.
  • రాగి పాత్రలో పరిశభ్రమైన నీటిని పోసి అందులో రుద్రాక్షను రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని తాగటం ద్వారా మధుమేహ లక్షణాలను తగ్గించుకోవచ్చు.
  • రుద్రాక్ష చూర్ణాన్ని మంజిష్ట ఔషధ చూర్ణంతో కలిపితే చక్కటి ఫేస్ ప్యాక్ తయారవుతుంది.
  • ఒక భాగం రుద్రాక్ష చూర్ణాన్ని మూడు రెట్ల శతావరి ఘృతంతో కలిపి మహిళలు తీసుకుంటే వారిలో ఉత్తేజకాల (హర్మోన్లు) స్థాయి చక్కగా మారి, పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
  • రుద్రాక్ష, చందనం కలిపి సేవిస్తే శరీరం చల్లబడుతుంది.
  • రుద్రాక్షను క్రమం తప్పకుండా ధరిస్తూ, సేవిస్తూ ఉంటే ఆయుష్షు పెరుగుతుంది.
  • రుద్రాక్షల నుంచి తీసిన నూనె అనేక చర్మ వ్యాధులలో చక్కటి ఔషధంగా పని చేస్తుంది.
  • రుద్రాక్ష చూర్ణం అధిక రక్తపోటును, ఉబ్బసాన్ని తగ్గించగలదని జంతువులపై చేసిన ప్రయోగాల్లో నిరూపితమైంది.

ఈ చికిత్సలను వైద్యల పర్యవేక్షణలోనే జరపాలని డా. రంగనాయకులు సూచించారు.

రుద్రాక్షలలో క్యాల్షియం ఆక్జలేట్, గ్యాలిక్ యాసిడ్, ట్యానిన్​లు, ఫ్లేవనాయిడ్​లు మరెన్నో ఇతర రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్​ను తొలగించి జన్యువులలో చెడు ఉత్పరివర్తనాలను కూడా నివారించగలవు. ఉత్పరివర్తనాలను నిరోధించే రసాయనాలు జీవకణం లోపల కానీ, బయట కానీ పనిచేస్తాయి. జన్యువులు తమంత తాము మరమ్మతు చేసుకునే శక్తి కూడా రుద్రాక్షల నుంచి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్లనే ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం సంపాదించిన రుద్రాక్ష ఆధ్యాత్మిక రంగంలోనూ గుర్తింపు పొందింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.