కుర్చీలో ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శరీరం మొత్తానికి రక్తప్రసరణ సక్రమంగా ఉండదు. అదే స్విస్ బంతి మీద కూర్చోవడం వల్ల శరీరం నిటారుగా ఉంటుంది. నడుం నొప్పి బాధించదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
- రోజూ మెట్లెక్కి దిగడం వల్ల మీరు చేసే వ్యాయామనికి అదనపు ప్రయోజనం అందినట్లే. కాలి కండరాలు దృఢంగా మారతాయి. రక్తంలో ఆక్సిజన్ నిల్వలు క్రమంగా పెరుగుతాయి.
- స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలని పదివారాల పాటూ క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడిపై పోరాడే ఫీల్‌గుడ్ ఎండార్ఫిన్లు పుష్కలంగా విడుదలవుతాయట. కౌన్సెలింగ్, చికిత్సలకన్నా వ్యాయామం ఇచ్చే ప్రయోజనాలే అధికం అంటున్నాయి అధ్యయనాలు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్