హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఇక నుంచి మొబైల్ వైరాలజీ ల్యాబ్ సేవలు వినియోగంలో రానున్నాయి. ఆన్లైన్ ద్వారా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ సంయుక్తంగా ల్యాబ్‌ని ప్రారంభించారు. బీఎస్ఎల్ 3 టెక్నాలజీతో ఈ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఐకామ్, ఐ క్లీన్ సంస్థల సహకారంతో డీఆర్డీఓ 15 రోజుల వ్యవధిలో ఈ ల్యాబ్‌ను రూపొందించింది.
ల్యాబ్ సహాయంతో రోజుకు 3 షిఫ్టుల్లో కలిపి 1000 మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. ఇతర వైరస్‌లపై ప్రయోగాలకు చేసేందుకు సైతం ఈ ల్యాబ్‌ని వినియోగించనున్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ తరహా ల్యాబ్‌లు భాగ్యనగరంలోనూ ప్రారంభం కావటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్