ETV Bharat / state

నేటితో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల ముగింపు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఆలయ అర్చకులు ఇవాళ మహాపూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకాలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం నృసింహ జయంతి మహాతంతుతో ఆలయ అర్చకులు ఉత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు.

yadadri sri laxminarasimaha swamy jayanthi utsavalu end today
నేటితో ముగియనున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు
author img

By

Published : May 6, 2020, 5:31 PM IST

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం మహాపూర్ణాహుతిని ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన అర్చకులు, అనంతరం సహస్ర కలశాభిషేకాన్ని ఘనంగా జరిపారు. వెయ్యి కలశాలను వరుస క్రమంలో పేర్చి, మంత్రజలంతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల వేదపారాయణాలు, రుత్వికుల మంత్రోచ్చరణల మధ్య సహస్ర కలశాభిషేక ఘట్టాన్ని ఘనంగా ముగించారు. సాయంత్రం నృసింహ జయంతి మహాతంతుతో ఉత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు అర్చకులు. లాక్​డౌన్ నేపథ్యంలో భక్తులు లేకుండానే ఆలయ అధికారులు ఉత్సవాలను నిర్వహించారు.

ఇవీ చూడండి: శివుడి కటాక్షం.. జగిత్యాలకు యాత్రికుల బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.