ETV Bharat / state

శివుడి కటాక్షం.. జగిత్యాలకు యాత్రికుల బృందం

లాక్​డౌన్​ కారణంగా వారణాసిలో చిక్కుకున్న జిల్లాకు చెందిన 50 మంది యాత్రికులు ఎట్టకేలకు జగిత్యాలకు చేరుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ వీరికి స్వాగతం పలికి.. యోగక్షేమాలను తెలుసుకున్నారు.

Varanasi pilgrims reached Jagtial
జగిత్యాలకు చేరుకున్న వారణాసి యాత్రికులు
author img

By

Published : May 6, 2020, 11:25 AM IST

జనతా కర్ఫ్యూకు ముందు ఉత్తరప్రదేశ్​లోని వారణాసి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన 58 మంది యాత్రికులు ఎట్టకేలకు జగిత్యాలకు చేరుకున్నారు. గత 50 రోజలుగా అక్కడే చిక్కుకుపోగా.. అక్కడి ప్రభుత్వం వారికి భోజనం, వసతి ఏర్పాటు చేసింది. అందరూ వృద్ధులు కావటం వల్ల తీవ్ర అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు రెండు ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు చేర్చేందుకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయటం వల్ల.. ప్రత్యేక బస్సులో జగిత్యాలకు చేరుకున్నారు.

వారికి జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ స్వాగతం పలికారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ఇల్లు చేరటం వల్ల యాత్రికులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: దేశ వ్యాప్తంగా 27.11 శాతం పెరిగిన నిరుద్యోగ రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.