యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పురపాలిక కమిషనర్ శ్రీదేవి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కమిషనర్‌కు ఆలయార్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఆలయాధికారులు స్వామి వారి లడ్డు, ప్రసాదం అందచేశారు.
శ్రీ దేవికి స్వామి వారి నూతన సంవత్సర క్యాలెండర్ అందచేశారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, స్థానిక పురపాలక అధికారులు మున్సిపల్ కమిషనర్ వెంట ఉన్నారు.
ఇవీ చూడండి : 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం