లింగోటంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కర్నె - Mlc_Dhanyama_Konugolu_Kendram_Prarambam
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రారంభించారు. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందని..రైతులెవరూ అధైర్యపడొద్దని ఆయన సూచించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోటం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కర్న్ ప్రభాకర్ ప్రారంభించారు. లాక్ డౌన్ వల్ల రైతులు భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. రైతులు దళారులని నమ్మి మోసపోవద్దని సూచించారు. గిట్టుబాటు ధర A గ్రేడ్ క్వింటాలుకు 1835 రూపాయలు, B గ్రేడ్ ధర క్వింటాలుకు 1815 రూపాయలు కల్పిస్తున్నామన్నారు. అధికారులు మీ గ్రామాల్లోకే వచ్చి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు.
కొనుగోలుకు టోకెన్లు
ధాన్యం కొనుగోలుకు ప్రతి రైతుకి అధికారులు టోకెన్లు అందజేస్తారని అన్నారు. టోకెన్లు అందిన రైతు ధాన్యం కుప్పకి ఒకరు మాత్రమే రావాలని కోరారు. ధాన్యం డబ్బులు నేరుగా రైతు బ్యాంక్ ఖాతా లోనే 20 నుంచి 25 రోజుల్లో జమ చేస్తామని వివరించారు. ప్రజలందరూ ఇళ్లలోనే స్వీయ నిర్బంధం కావాలని ప్రభాకర్ కోరారు. కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ చెన్నగొని అంజయ్య, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.