యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. అలంకార సేవలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రాత్రి 9 గంటలకు శేష వాహన సేవ జరగనుంది. యాదగిరీశుడు నిత్యం రెండు సార్లు అలంకార సేవల్లో దర్శనమిస్తారు. ఆదివారం కావటంతో దర్శనానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. అటు బాలాలయంలో స్వామి దర్శనంతో పాటు మత్స్యావతార సేవను తిలకించి తన్మయత్వం చెందారు.
ఇవీ చూడండి:'సమర భేరి' సాయంత్రమే...