మొన్నటి వరకు గ్రీన్జోన్లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు పాజిటివ్ కేసులతో రెడ్ జోన్లోకి మారేలా ఉంది. సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన నలుగురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉండటం వల్ల పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు.
సంస్థాన్ నారాయణపురం మండలంలోని ప్రజలను మరింత అలర్ట్ చేయడానికి రాచకొండ కళా బృందం రంగంలోకి దిగింది. కరోనా వైరస్ కట్టడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నారు. రాచకొండ కమిషరేట్ ఆధ్వర్యంలో కళాకారులతో కరోనా వైరస్ భూతం వేషధారణలతో నారాయణపురంలో అవగాహన కల్పించారు పోలీసులు. గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి కరోనా బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో పాటల రూపంలో వివరిస్తున్నారు. ప్రజలు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ తీసుకుని భౌతికదూరం పాటించినప్పుడే కరోనాను తరిమికొట్టవచ్చని ఎస్సై నాగరాజు వివరించారు.
ఇదీ చూడండి: కరోనాను జయించిన వారి సాయంతో వైరస్‌కు కళ్లెం!