కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే గొంగిడి సునీత తాజా వార్తలు ఆత్మకూరు
యాదాద్రి జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య ఉందో.. ఎప్పుడు ఏం చేయాలో సీఎం కేసీఆర్కు తెలుసని ఆమె పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మేనమామ, ఒక పెద్దన్న లాగా వారి కల్యాణానికి సాయంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో చెక్కులను అందించి ఆదుకుంటున్నారని ఆమె తెలిపారు.
పోరాడి సాధించిన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎవరికి ఏ సమస్య ఉందో.. ఎప్పుడు ఏం చేయాలో తెలుసని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలే కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీత కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
తెలంగాణ పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మేనమామ, ఒక పెద్దన్న లాగా వారి కల్యాణానికి సాయంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో చెక్కులను అందించి ఆదుకుంటున్నారని ఆమె తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వారికి దవాఖానా ఖర్చులకు సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. అమ్మఒడి పథకం ద్వారా గర్భవతులకు రూ.12 వేలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయితే కేసీఆర్ కిట్టు సమకూరుస్తున్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం, స్థానిక సర్పంచ్ జన్నాయి కోడే నగేష్, ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి, కూరేళ్ల గ్రామ సర్పంచ్, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, సర్పంచ్లు కోల సత్తయ్య, జామ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బస్టాండ్లో మదర్ ఫీడింగ్ సెంటర్ను ప్రారంభించిన ప్రభుత్వ విప్