ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. అపెండిసైటిస్​ సమస్యకు శస్త్రచికిత్స చేస్తే... ప్రాణానికే ముప్పు వచ్చింది. ఆసుపత్రికి తాళం వేసి వైద్యులు, సిబ్బంది పారిపోయారు. మృతురాలి బంధువులు ఆసుపత్రి ముంది ధర్నా చేపట్టారు.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
author img

By

Published : Jan 4, 2020, 7:01 PM IST

వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సుధాకర్​ ఆసుపత్రిలో... వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. మృతురాలి బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. ఆసుపత్రికి తాళం వేసి వైద్యులు, సిబ్బంది పారిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ప్రవళిక చనిపోయిందని బంధువులు ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన ప్రవళికను... కడుపునొప్పితో బాధపడుతుండగా సుధాకర్ ఆసుపత్రిలో చేర్చారు. అపెండిసైటిస్​ సమస్యగా నిర్ధరించి... వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అది కాస్తా వికటించింది. వెంటనే హన్మకొండ తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ.. ప్రవళిక ప్రాణాలు కోల్పోయింది. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

ఇదీ చూడండి: మున్సిపోల్​లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.