సర్వేలు అన్ని తెరాసకే అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో గులాబీ పార్టీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు భాజపా పోటీ అనే అపోహలు వద్దని... ఎవరితోనూ పోటీ లేదని పేర్కొన్నారు. పార్టీ ఒకసారి అభ్యర్థిని ఖరారు చేశాక ఆ అభ్యర్థి గెలుపు కోసమే అందరూ పని చెయ్యాలని ఆదేశించారు.
అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు.