బాల్యం ఎంతో మధురమైనది. ఇక కళాశాల రోజులైతే చెప్పక్కర్లేదు. ఉద్యోగరీత్యా వేరు వేరు ప్రాంతాలకు వెళ్లినా... వారందరినీ వజ్రోత్సవ వేడుక దగ్గర చేసింది. వరంగల్ కాకతీయ వజ్రోత్సవ వేడుకల్లో పూర్వ విద్యార్థులంతా ఒక చోటికి చేరి సందడి చేశారు. పూర్వ విద్యార్థులంతా కలిసి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మిత్రులతో చేసిన అల్లరిని సరదాగా గుర్తు చేసుకున్నారు. వృత్తి జీవితంలో తీరిక లేకుండా గడిపిన వారంతా ఓ పండుగ వాతావరణంలా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రోజును తమ జీవితంలో మరిచిపోలేమంటున్న పూర్వ విద్యార్థులతో ఈటీవీ భారత్ ముఖాముఖి....
ఇదీ చూడండి : ఆర్థిక అభివృద్ధే కాదు... మానవసంబంధాలూ పరిపుష్టం