వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్న కూతురిపై ఓ తండ్రి దుర్మార్గానికి ఒడిగట్టాడు. మూడు నెలలుగా అత్యాచారం చేసిన ఘటన అలస్యంగా వెలుగు చూసింది. నగరంలో కారు డ్రైవర్గా పని చేస్తున్న కుమారస్వామి అతని రెండో కూతురిపై గత మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అయితే పెద్ద కూతురికి అనుమానం వచ్చి తన తల్లికి చెప్పగా... అసలు విషయం బయటపడింది. బంధువులతో చర్చించి నిందుతుడి భార్య సుబేదారి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి...కనులవిందుగా శ్రీశైలం జలాశయ అందాలు