సాధరణంగా శ్రావణమాసంలో నిత్యం ఏదోక పూజ చేస్తూ... వాయినాలు ఇచ్చుకుంటూ మహిళలు సందడి చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. మంగళవారం, శుక్రవారాలలో ప్రత్యేక పూజలు, వ్రతాలు చేసుకుంటారు. రెండో శుక్రవారం వచ్చే వరలక్ష్మీ వ్రతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సకల శుభాలు కోరుతూ... సామూహిక వ్రతాలు ఆచరిస్తారు. ఇది ఒకప్పడు పరిస్థితి. కానీ ఇప్పుడు అంతా తారుమారైంది. అమ్మవారికి మనసారా పూజలు చేసి... నోములు నోచుకుందామంటే వీలుకాని పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా... ఎవ్వరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైరస్ మన దరికి చేరకుండా ఉండాలంటే దూరం తప్పనిసరిగా పాటించాల్సిందే. అందుకే శ్రావణమాసంలో జరిపే పూజలు, వ్రతాలకు మహిళలు దూరంగా ఉంటున్నారు. పూజలు ఇంట్లోనే చేసుకుని... ఇంటికే పరిమితం కావాలనుకుంటున్నారు. మరికొందరు నోములు, పూజలకయ్యే డబ్బును అవసరమైన వారికి వినియోగిస్తున్నారు.
కొన్ని దేవాలయాల్లో కూడా సామూహిక వ్రతాలు నిర్వహించకూడదని నిర్ణయించారు. కరోనా మహమ్మారి దరిచేరకూడదని... వైరస్ పీడ తొలగిపోవాలని ఇళ్లలోనే అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: సాంక్రామిక వ్యాధులు స్వయంకృతం