ETV Bharat / state

ఉద్రిక్తతకు దారితీసిన ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్​ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు తలపెట్టిన రిలే నిరాహార దీక్ష స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఎంజీఎం ఆస్పత్రి వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులను ముందస్తు అరెస్టు చేయడం వల్ల కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

warangal, workers
sanitary workers, mgm hospital
author img

By

Published : Apr 1, 2021, 1:41 PM IST

పెండింగ్​ వేతనాలు చెల్లించాలంటూ వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులను పోలీసులు ముందస్తుగానే అడ్డుకోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకొని ఒక్కసారిగా ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర భవనం పైకి దూసుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తోసుకుంటూ ముందుకెళ్లారు.

వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఆందోళన
వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఆందోళన

భవనం పైనున్న వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అరెస్టు చేయడం బాధాకరమని వాపోయారు. కలెక్టర్​ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. తమ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కారమయ్యేవరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

ఇదీ చూడండి: కవ్వింపుగా వలవేసి... వేధించి ఉసురు తీసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.