Telangana Farmers Waiting for Rythu Bandhu Funds 2023 : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు, అధికారులు రైతుబంధు చెల్లింపులు ప్రారంభించారు. 70 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో, రూ.7,000 కోట్ల మేర నిధులను జమచేసేందుకు చర్యలు చేపట్టారు. గతంలో మాదిరిగానే ఎకరాకు రూ.10,000 చొప్పున ఈ పంట కాలానికి ఎకరాకు రూ.5,000 ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.
కొన్ని చోట్ల రైతుబంధు కోసం అన్నదాతల పడిగాపులు : కానీ కొన్ని చోట్ల రైతుబంధు కోసం (Rythu Bandhu Funds), రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇంకా పంట పెట్టుబడి సాయం అందలేదని వరంగల్ రూరల్ జిల్లాలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి ఐనవోలు మండలాల కర్షకులు డబ్బులు ఎప్పుడు పడతాయోనని కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. వచ్చే పంట ఎలా సాగు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
Telangana Rythu Bandhu Funds 2023 : రైతుబంధు నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో జమ
వచ్చే పంట ఎలా సాగు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రైతులు : నవంబర్ నెల చివరి వారంలోనే పడే రైతుబంధు డబ్బులు, డిసెంబర్ గడుస్తున్నా ఎందుకు వేయడం లేదని ప్రభుత్వాన్ని అన్నదాతలు నిలదీస్తున్నారు. యాసంగి సాగుకు పెట్టుబడి పైకం చేతికి అందక, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనాలన్నా డబ్బు లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారు
త్వరగా రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి : చేతిలో ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా కొలుదీరిన సర్కార్ రైతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, త్వరగా ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఖరీఫ్‌లో సాగుచేసిన పంట ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోలు జరగలేదని, ప్రభుత్వం ఈ విషయంపై కూడా దృష్టి సారించాలని కర్షకులు కోరుతున్నారు.
"నవంబర్ నెల చివరి వారంలోనే రైతుబంధు డబ్బులు పడేవి. ఇప్పుడు ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. విత్తనాలు, ఎరువులు తెచ్చుకునేందుకు డబ్బులు లేకుండా పోయాయి. ఫలితంగా యాసంగి సాగుకు ఆలస్యమవుతోంది. త్వరగా రైతుబంధు డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఖరీఫ్‌లో సాగుచేసిన పంటను ప్రభుత్వం ఇంకా కొనలేదు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం." - అన్నదాతలు
Rythu Bandhu Funds Releasing Today : నేటి నుంచి కర్షకుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ
Telangana Rythu Bandhu Funds 2023 : మరోవైపు రైతులందరికీ యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు సాయం తప్పనిసరిగా అందుతుందని అధికారులు అంటున్నారు. అర్హులైన అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు చేపట్టామని చెబుతున్నారు. మరోవైపు కొంత మందికి రైతుబంధు నిధులు జమ కావడంతో వాటిని విత్ డ్రా చేసుకునేందుకు వెళ్తున్న రైతులతో బ్యాంకులు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటి వరకూ ఎకరా, రెండు ఎకరాలలోపు కర్షకులకే నిధులు జమయ్యాయి. మిగతా కర్షకులు కూడా తమ ఖాతాలో డబ్బులు వచ్చాయేమోనని బ్యాంకుకు వచ్చి ఆరా తీస్తున్నారు.
డిసెంబర్ ఆఖరిలో రైతుబంధు 100 శాతం ఇస్తాం : పొన్నం ప్రభాకర్
Telangana Rythu Bandhu Funds 2023 : రైతుబంధు నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో జమ