వరంగల్ గ్రామీణ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ హాజరయ్యారు. ఓటు నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు.
పట్టభద్రులైన యువతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. మండల పరిధిలోని గ్రామాల వారీగా పట్టభద్రుల జాబితా రూపొందించి... అందరినీ ఓటు వేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: త్వరలో ఆంగ్లం, ఉర్దూ మీడియంలో విద్యా బోధన: మంత్రి సబిత