కనుమ పండుగను పురస్కరించుకుని వరంగల్ గ్రామీణ జిల్లా దమేర మండలం ఊరుగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. సుందరంగా అలంకరించిన నరసింహస్వామిని దర్శించుకుని పునీతులయ్యారు.
ఆలయ ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా స్వామి దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి : 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం