కేంద్రం తీసుకువచ్చిన బిల్లులను వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలను వెంటనే బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ మంత్రి విజయరామారావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో భాజపా శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లు తీసుకువచ్చామని భాజపా నేతలు తెలిపారు.
- ఇవీచూడండి: కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి