వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు పెంచిన ప్రకారం అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అర్హులై ఉండి పింఛన్లు రాని వారు సోమవారం పురపాలక సంఘం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కేటాయించిన 26కోట్ల ప్రత్యేక నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇదీ చూడండి: నగరపాలక సంస్థ ముందు బిందెలతో ప్రదర్శన