పట్టభద్రులంతా తమ పేరుని ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి కోరారు. 2017 నవంబర్ నాటికి పట్టభద్రలైన వారందరూ అర్హులేనని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 2, 3 వార్డుల్లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం రోజు ప్రారంభించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి అర్హులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: రెండ్రోజులు వానలున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి : కేసీఆర్