వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో నివాసం ఉంటున్న సమీరా బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ యజమానులు పెట్టే బాధలు భరించలేక తనను స్వదేశానికి రప్పించాలని వేడుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఈటీవీ భారత్లో వచ్చిన ఈ కథనానికి స్పందించిన వికారాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు కరణం రావు స్పందించారు. దుబాయ్లో ఉన్న తన స్నేహితుడు భాజపా ఐటి సెల్ శ్రీనివాస్ సహాయంతో సమీనాతో ప్రహ్లాద్ రావు ఫోన్లో మాట్లాడి, తన యోగక్షేమాలు తెలుసుకున్నారు. త్వరలోనే స్వదేశానికి పంపించే విధంగా తన స్నేహితుడు శ్రీనివాసరావు ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. నకిలీ ఏజెంట్ల ద్వారా బయటి దేశాలకు వెళ్లవద్దని ఆయన సూచించారు.
భాజపా నాయకుల స్ఫూర్తితో స్వదేశానికి సమీరా
దుబాయ్లో యజమాని పెట్టే బాధలు భరించలేక, సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన యువతి కథనాన్ని ప్రచురించిన ఈటీవీ భారత్ కథనానికి భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కరణం రావు స్పందించారు. స్వదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.